//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్నాతకోత్సవ వేడుకలో గంటాపై గవర్నర్ ఫైర్ ... ఎందుకంటే

Category : state politics

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ కు కోపం వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుక లో గవర్నర్ నరసింహన్ ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పై ఫైర్ అయ్యారు. స్నాతకోత్సవ వేడుకలో గంటా వ్యాఖ్యలపై గవర్నర్ విరుచుకుపడటంతో స్నాతకోత్సవ వేడుక కాస్త రసాభాసగా మారింది

ఇంతకీ గవర్నర్ కు కోపం వచ్చేలా గంటా శ్రీనివాస్ ఏమన్నాడంటే ప్రతి సంవత్సరం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ 25 వేల కోట్లు ఖర్చు చేస్తూ విజ్ఞాన సమాజాన్ని నిర్మించటానికి ఏపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. అలాగే ఏపీకి ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు చాలానే వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రైవేటు యూనివర్సిటీలతో పోటీపడాలని గంటా శ్రీనివాసరావు స్నాతకోత్సవ సభలో మాట్లాడారు.

ఇక గంటా శ్రీనివాస రావు మాట్లాడిన వ్యాఖ్యలను గవర్నర్ నరసింహన్ తప్పుబట్టారు. ప్రైవేట్ యూనివర్సిటీలతో ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీపడాలని వ్యాఖ్యానించడం నేరమని ఆయన ఫైర్ అయ్యారు. మంత్రి హోదాలో ఉండి అలా వ్యాఖ్యానించడం సరికాదని గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. అంతేకాకుండా ప్రభుత్వ విద్యను ప్రైవేటు యూనివర్సిటీలతో నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పీ.హెచ్.డి లను కూడా డిగ్రీ తరహాలో మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు వల్లే ఉన్నత విద్య ప్రస్తుతం ఈ దశలో ఉందని బాధ పడ్డారు. ఇక విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు, పదోన్నతులకు పి హెచ్ డి తప్పనిసరి కావడంతో ఇష్టారాజ్యంగా విద్యా ప్రమాణాలు పాటించకుండా పి హెచ్ డి లు చేస్తున్నారని పరిశోధనలో నాణ్యత పడిపోతుందని అవి సమాజానికి ఉపయోగకరంగా ఉండటం లేదని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు.

బిఏ, బి.కాం ల మాదిరిగానే పిహెచ్ డి లు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన నరసింహన్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కట్ కాపీ పేస్ట్ సంస్కృతి పెరిగిందని ఈ పద్ధతి మారాలని తన అభిప్రాయం వ్యక్తీకరించారు. ఇక పర్సంటేజీ లతో వివిధ విద్యా సంస్థలలో స్వీట్లు దక్కుతున్న నేపథ్యంలో కేవలం మార్కుల పర్సంటేజీ ల కోసం విద్యార్థులు యంత్రాల్లా మారారని ఇది హానికరమైన దని ఆయన చెప్పారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన వారికి, పి హెచ్ డి, ఎం ఫిల్ పూర్తి చేసిన వారికి పట్టాలు అందించిన నరసింహన్ మంత్రి గంటా అక్కడ ఉండగానే గంటా వ్యాఖ్యలను ఖండిస్తూ ఫైర్ అవ్వడం చర్చనీయాంశమైంది.