//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌..!

Category : national

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తెలుగు ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందామని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాగా.. రేపు (జనవరి-26) హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:15 గంటలకు గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

అనంతరం బేగంపేట నుంచి గవర్నర్‌ విజయవాడకు బయలుదేరతారు. ఏపీలోని విజయవాడలో ఉదయం 11:25 గంటలకు జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

Related News