//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ !

Category : national

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తమ పార్టీ నాయకుడినే నిలబెట్టాలని పట్టుబడుతూ వస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పుడు మనసు మార్చుకొని అందరికి సమ్మతమైన పేరు కోసం చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మనుమడు, మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును ఆమె తెరపైకి తీసుకు వచ్చారు. ఆయన అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షాల నుండి దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నది. 

ఇప్పటికే సోనియా గాంధీ, సిపియం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ విషయమై గాంధీతో మాట్లాడినట్లు తెలుస్తున్నది. ప్రతిపక్షాలు ఈ విషయమై తనను సంప్రదించిన్నట్లు గాంధీ కూడా తెలిపారు. కాంగ్రెసేతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ నాయకుడిని అభ్యర్థిగా చేయడం పట్ల సుముఖంగా లేకపోవడంతో మొదట లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పేరును సూచించిన సోనియా ఇప్పుడు గాంధీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనెర్జీ తో సోనియా ఈ విషయమై నిన్ననే ఫోన్ లో మాట్లాడారు. గాంధీ పేరు పట్ల ఆమె సహితం సుముఖత వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. 2019 ఎన్నికల నాటికి బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు అధ్యక్ష ఎన్నికను ఒక కీలక అవకాశంగా తీసుకొని, సోనియా గాంధీ ఆ దిశలో విశేషంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నితీష్ కుమార్, శరద్ పవర్, ఒమర్ అబ్దుల్లా వంటి నాయకులతో సమాలోచనలు జరిపారు.

 ప్రాంతీయ పార్టీల మనుగడనే ప్రశ్నించే స్థితిలో బిజెపిని వ్యాప్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉండడంతో పలు చిన్న చిన్న పార్టీలను సహితం ఈ సందర్భంగా దరిచేర్చుకొనే ప్రయత్నం సోనియా చేస్తున్నారు. 

ప్రముఖ రచయత రాజ్ మోహన్ గాంధీ సోదరుడైన గోపాలకృష్ణ గాంధీ ఐ ఏ యస్ అధికారి. యుకె, దక్షిణ ఆఫ్రికా,  శ్రీ లంకలలో భారత్ హై కమీషనర్ గా , నార్వే లో భారత రాయబారిగా పని చేశారు. యుపిఎ హయాంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఐదేళ్లు ఉన్నారు. 2012 ఎన్నికల్లో ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేయమని మమతా బనెర్జీ కోరితే ఆయన సున్నితంగా తిరస్కరించారు.

 ఇలా ఉండగా, కాంగ్రెసేతర అభ్యర్థిని కాంగ్రెస్ ప్రతిపాదించడం అంటే 2019 ఎన్నికల్లో సహితం ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులెవ్వరూ ముందుకొచ్చే అవకాశాలు లేన్నట్లే అని పరిశీలకులు భావిస్తున్నారు.