వైజాగ్ పోర్టు లో సరుకు రవాణా ఈ ఏడాది పడిపోయింది. గతేడాదితో పోల్చితే సరుకు రవాణా సామర్ధ్యాన్ని కోల్పోయే పరిస్థితులకు నెట్టబడుతోంది. దేశంలోని 16 మేజర్ పోర్టుల్లో తూర్పుతీరంలో అపార సహజవనరులు, ఖనిజ సంపదలు కలిగి వున్న విశాఖలో పోర్టు ఉన్నప్పటికీ సరకు రవాణాలో బలహీనస్థాయికి చేరుతోంది.
2016లో 57 మెట్రిక్ టన్నులు (ఎంపిటిఎ) సాధించి 2017లో 60 మిలియన్ టన్నుల దగ్గరే నిలిచిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ కోటి 82 లక్షల 86 వేల మెట్రిక్ టన్నులవరకూ కార్గో హేండ్లింగ్ జరగ్గా, గతేడాది ఇదే కాలానికి కోటి 88 లక్షల 67 వేల మెట్రిక్ టన్నుల పైగా సరకు రవాణా జరిగింది. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల కార్గో తగ్గింది.
స్టీల్ధరలు పెరగడం, కోల్ దిగుమతులు సక్రమంగా లేకపోవడంతో హేండ్లింగ్లో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి స్టీమ్కోల్ దిగుమతి పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో పోర్టు మిగిలే పరిస్థితి లేదన్న చర్చ తాజాగా అధికార వర్గాల్లో జరుగుతున్నట్లు తెలిసింది.