గూగుల్ సర్చ్ ఇంజిన్ అలియాస్ గూగుల్ తల్లి గురించి మీకు చెప్పనక్కర్లేదు అలాంటి గూగుల్ సర్చ్ ఇంజిన్ తమ వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. అదేంటి అంటే సెలెబ్రిటీలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం కోసం నెటిజన్లు గూగుల్ని ఆశ్రయిస్తుంటారు.
ఒక్కో వెబ్సైట్లో ఒక్కో సమాధానం ఉండటంతో సరైన సమాధానం ఏంటో తెలియక సతమతమవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని చెప్పడానికి సెర్చింజన్లో ఓ కొత్త ఫీచర్ను గూగుల్ ప్రవేశపెట్టింది.స్మార్ట్ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి, ఎవరైనా సెలబ్రిటీ గురించి ప్రశ్నలు అడిగితే వారే స్వయంగా సెల్ఫీ వీడియోల ద్వారా సమాధానం చెబుతారు.
నిన్ననే ప్రారంభమైన ఈ ఫీచర్లో ప్రస్తుతం ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, మార్క్ వాల్బర్గ్, జేమ్స్ ఫ్రాంకో, జినా రోడ్రిగేజ్ వంటి సెలబ్రిటీల సెల్ఫీ వీడియోల సమాధానాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత మంది సెలెబ్రిటీల వీడియోలను జోడించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఈ ఫీచర్ను పరీక్షించాలంటే How many languages does Priyanka Chopra speak? అని స్మార్ట్ఫోన్ గూగుల్ సెర్చ్ బార్లో కొట్టి చూడండి.