దేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ సంస్థల జాబితాలో గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. మెర్సిడెజ్-బెంజ్ రెండో స్థానంలో నిలిచిందని ‘రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2017’ సర్వే తెలిపింది. రంగాల వారీగా చూస్తే ఇ-కామర్స్‌లో అమెజాన్ ఇండియా; ఎఫ్ఎమ్సీజీలో ఐటీసీ; వినియోగదారు, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఫిలిప్స్ ఇండియాలు అగ్రస్థానంలో నిలిచాయి. అలాగే కాగ్నిజెంట్, హెచ్‌పీ, హెచ్‌పీసీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, సామ్సంగ్, ఎస్బీఐ, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, టీసీఎస్, టాటా మోటార్స్, టయోటా, విప్రో సంస్థలు కూడా అత్యంత ఆకర్షణీయ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.