Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలీవుడ్ తోలి తరం హీరోయిన్ "మధుబాలకి".... గూగుల్ నివాళి..

Category : movies

హిందీ చిత్ర సీమలో మొదటి తరం నటీమణుల్లో మధుబాల ఒకరు. తన అందం అభినయంతో ఎంతో మంది హృదయాలలో చోటు సంపాదించుకున్న నటి. అంత ఈమెను బాలీవుడ్ మార్లిన్ మన్రో తో పోల్చి చుస్తారు. అయితే మధుబాల 86వ జయంతి సందర్భంగా

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆమెకు నివాళులు అర్పిస్తూ డూడుల్‌లో ఆమె ఫోటోను ఉంచి నివాళులు అర్పించింది. వివరాల్లోకి వెళితే .... 1933లో ఫిబ్రవరిలో న్యూ ఢిల్లీలో అఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ఒక ముస్లిం సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది మధుబాల . ఆమె అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి. 9 ఏళ్ల వయసులో నటిగా పరిచయమయిన మధుబాల..14 ఏళ్ల వయసులో ‘నీల్ కమల్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

బాలీవుడ్‌లో ఆమె హీరోయిన్ గా ‘మొఘల్-ఏ-ఆజమ్, ‘చల్తీ కా నామ్ గాడీ’, ‘మహల్’ 'మిస్టర్ &మిస్సెస్ 55 ','బర్సాటు కి రాత్ 'వంటి రొమాంటిక్, డ్రామా, కామెడీ వంటి అనేక చిత్రాలతో తొలి తరం ప్రేక్షకుల గుండెల్లో మధుబాల కొలువైవుంది. ఆ తర్వాత ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకోవడం..ఆ తర్వాత విడిపోవడం జరిగింది. ఒక సినిమాకు కావాల్సినంత మసాలా మధుబాల జీవితంలో వుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె జీవితంపై ఒక బయోపిక్ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఒక రకంగా మన తెలుగు అలనాటి హీరోయిన్ మహానటి సావిత్రి లాగే ఈమె జీవితం కూడా విషాదాంతం అవడం విచారమనే చెప్పాలి. 1969 ఆమె జన్మించిన ఫిబ్రవరి నెలలోని 23 తేదిన ఈ లోకాన్ని విడిచి వెళ్లింది.మొత్తానికి మధుబాల కన్నుమూసి చాలా రోజులు అవుతున్నఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో తన సినిమాలతో చిరస్థాయిగా నిలిచిపోయింది.మరోసారి ఆమెను గుర్తు చేస్తూ గూగుల్ నివాళి...ఇవ్వడం విశేషం.

Related News