//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

1947 లో వస్తువుల ధరలు ఎలా ఉండేవో తెలుసా ...!

Category : national

సమయం ఇది ఎవరి కోసం వేచి ఉండదు, అది అలా జరుగుతూ ఉంటుంది , ప్రతిక్షణం మారుతూనే ఉంటుంది . అలాగే సమయంతో పాటు ఈ ప్రపంచంలో పలు రకాల మార్పులు జరుగుతూనే ఉంటాయి . అలాగే సమయం మారుతున్నప్పటికీ మన మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు కొన్ని అలాగే ఉంటాయి . మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది . ఈ 71 సంవత్సరాలలో మన దేశంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి . కానీ 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు , మన దేశం ఎలా ఉండేది , ఆ సమయంలో కొన్ని రకాల వస్తువుల ధరలు ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం ....

స్వాతంత్రం వచ్చిన రోజుల తో పోల్చుకుంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి . అంతేకాకుండా మన జీవిత వ్యవహారశైలిలో కూడా ఊహించని మార్పులు వచ్చాయి . జీతాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి . జీతాలు ఎంతగా పెరిగిన ప్రస్తుత రోజుల్లో ఒక సామాన్యుడు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు . కానీ 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ పరిస్థితి అలా లేదు . ఆ కాలంలో జీతాలు చాలా తక్కువ అయినప్పటికీ , ఒక సామాన్యుడు తన కుటుంబాన్ని ఎంతో తేలికగా పోషించేవాడు. ఆ రోజుల్లో వస్తువుల ధరలు రూపాయలు పైసలు లలో ఉండేవి . అప్పుడు రూపాయి బిళ్ళలని వెండితో కూడా తయారు చేసేవారు . ఆ కాలంలో ఒక రూపాయి విలువ 16 అణాలు ఇంకో విషయం ఏమిటంటే అప్పట్లో ఒక రూపాయి అంటే 100 పైసలు కాదు అరవై నాలుగు పైసలు మాత్రమే , 1957లో సిస్టం మారిన తరువాత రూపాయి విలువని 100 పైసలు చేశారు . మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పట్లో మన ఒక్క రూపాయి , అమెరికన్ డాలర్ తో సమానం . కానీ ప్రస్తుతం ఒక డాలర్ విలువ అరవై ఐదు రూపాయలు తో సమానంగా పెరిగిపోయింది . అప్పట్లో రూపాయి చాలా బలమైనది , ఎంతగా అంటే ఆ ఒక్క రూపాయి తోనే ఇంట్లోకి అవసరమైన అన్ని వస్తువులని కొనుక్కోవచ్చు .

అప్పట్లో నిత్యావసరాల ధరలు అన్నీ కూడా పైసల లో మాత్రమే ఉండేవి . కిలో బియ్యం అరవై ఐదు పైసలు గాను , కిలో చెక్కర 40 పైసలుగాను ఉండేవి , 1947 లో ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 25 పైసలు మాత్రమే , 1947లో తెనాలి రామకృష్ణ గారి పుస్తకం కేవలం ఒకటిన్నర రూపాయి ఉండేది . ఆ రోజుల్లో సినిమా టికెట్లు కూడా 30 పైసల నుండి ఉండేవి , మరో ముఖ్య విషయం అప్పట్లో బంగారం రేటు ఒక గ్రాము పది రూపాయల కంటే తక్కువగా ఉండేది . ప్రస్తుత రోజుల్లో జీవిస్తున్న మనకి అప్పట్లో ఉన్న రేట్లను వింటే కొంచెం వింతగా అనిపిస్తుంది .ఇక మనమైతే మన జీవితంలో అలాంటి రేట్లని చూడలేము , మన జ్ఞాపకాల్లో మాత్రమే ఇవి ఎప్పటికీ మిగిలిపోతాయి.