ఐపిఎల్ 11వ సిజన్ లో ముంబై అభిమానులు ఉపిరిపిల్చుకున్నారు. నిన్న రాత్రి జరిగిన మ్యచ్ లో పంజాబ్ తో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసు లో నిలిచింది. గత ఐపిఎల్ సిజన్ లో విన్నర్స్ గా నిలిచిన ముంబై ఈ సిజన్ లో కొంచెం వెనుకబడింది. ముంబై ప్రతిసారి మొదటి మ్యాచ్ లు ఓడిపోయినా తరువాత మ్యాచ్ లు మొత్తం వరుసగా గెలుచుకుంటు వచ్చింది. దింతో ఫైనల్ గా టైటిల్ కొట్టేసింది. ఇక ఐపిఎల్ లో ఎడు మ్యాచ్ లు ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ టీం తొలగిపోయినట్టే. అయితే ఈసిజన్లో ముంబై కి నిన్న పంజాబ్ తో ఆడిన మ్యాచ్ గొడ్డలిపెట్టు వంటిదే. ఎందుకంటే ముంబై ఆడిన మ్యాచ్ లలో 8మ్యాచ్ లలో 6మ్యాచ్ లు ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఓడిపోతే ముంబైకి ప్లే ఆఫ్ రేసులోంచి వెళ్లిపోవాల్సిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తమ ప్రదర్శనను చూపించారు. ముంబై ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో ఇది 3వ విజయం. సరైన మ్యాచ్ లో ముంబై తన సత్తాను చాటింది. మొదట బ్యాటింగ్ పంజాబ్ 174 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై బ్యాట్స్ మెన్లు పంజాబ్ కు ముచ్చెమటలు పట్టించారు. 19ఓవర్లలో మ్యాచ్ ను గెలిపించారు. ముంబై ఓపెనర్ సూర్యకుమార్ 57పరుగులు చేశాడు. అల్ రౌండర్ కృనాల్ పాండ్య 31పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. అటు బౌలింగ్ బ్రూమ్రా, మయాంక్ మార్కండే ఇద్దరూ తమ బౌలింగ్ పంజాబ్ టీంను కట్టడి చేశారు. మొత్తం మీద ముంబై అభిమానులను కొంత ఉరట లభించింది.