//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ -ఆర్బీఐ నుండి భారీ నోటిపికేషన్

Category : national

మన దేశంలో యావత్తు బ్యాంకింగ్‌ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామకం కోసం ఈ ప్రకటనను జారీ చేసింది.

అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత చాలు.

ఎంపిక విధానం

ఎంపిక విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ అనే మూడు దశలు ఉంటాయి. ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. వీటిలో నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పునకు 1/4 మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌

ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలను గుర్తించడానికి గంట (60 నిమిషాలు) సమయం ఉంటుంది. ఇందులో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే తరవాతి దశలో ఉండే మెయిన్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 30

న్యూమరికల్‌ ఎబిలిటీ 35 35

రీజనింగ్‌ ఎబిలిటీ 35 35

మొత్తం 100 100

మెయిన్‌ ఎగ్జామినేషన్‌

ఇందులో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగు తారు. దీనిలో సబ్జెక్ట్‌ వారీగా సమయాన్ని నిర్దేశించారు. కాబట్టి ఆ సమయంలోపే ఆ విభాగాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించిన వారికి మాత్రమే తరవాతి దశలో ఉండే లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు సమయం

రీజనింగ్‌ 40 40 30 ని.

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 40 40 30 ని.

న్యూమరికల్‌ ఎబిలిటీ 40 40 30 ని.

జనరల్‌ అవేర్‌నెస్‌ 40 40 25 ని.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 40 20 ని.

మొత్తం 200 200 135 ని.

లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థుల భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఖాళీలను అనుసరించి ఆయా బ్రాంచ్‌లు నెలకొని ఉన్న ప్రాంతాల్లోని స్థానిక/అధికారిక భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. లేకపోతే డిస్‌క్వాలిఫైయిడ్‌గా ప్రకటిస్తారు. చివరగా మెయిన్‌ ఎగ్జామ్‌, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించి పోస్టింగ్‌ను ఖరారు చేస్తారు.