Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ అభిమానులకు శుభవార్త..... సాహో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.

Category : movies

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సాహో. ప్రభాస్ కెరీర్ లోనే ఎంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి కి మించిన హై స్టాండర్డ్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమాకు సుమారు 300 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. ఇందుకు తగినట్టు గానే ఈ సినిమాలో కూడా ఆ స్థాయి నటీనటులను తీసుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ‘సాహో’ సినిమా పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ఈ సినిమాను ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ ను విడుదలకు సిద్దం చేస్తున్నారు చిత్ర యూనిట్.సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండడం తో ...... ఈ నేపథ్యంలో ప్రభాస్ తన అభిమానులకు ఓ తీపి కబురు అందించారు.

‘సాహో’ విడుదల తేదీని ప్రకటించారు. ఈనెల 13న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన వెల్లడించారు.దీనితో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్ పోస్టర్‌ను కూడా ఈ పోస్ట్‌లో పొందుపరిచారు. " హే డార్లింగ్స్ " , జూన్ 13న వస్తోన్న టీజర్‌తో ‘సాహో’ ప్రపంచంలోకి అడుగుపెట్టండి. జూన్ 14 నుంచి థియేటర్లలో టీజర్‌ను ఎంజాయ్ చేయండి’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రభాస్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేసిన ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించారు. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు నటిస్తున్నారు.

Related News