//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2025కల్లా ఐటీ ఇండస్ట్రీ 25-30 లక్షల ఉద్యోగాలు కల్పించనుందట.

Category : national

ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిణామాల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం తిరోగమనంలో పయనిస్తుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఐటీ రంగంపై ఆశలు వదులుకోవడమే ఉత్తమం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయినట్లు కూడా కొందరి మాట. అయితే దీన్ని కేంద్ర ఐటీ న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొట్టి పారేశారు. అంతేకాదు పెద్ద తీపి కబురు చెప్పారు. 2025కల్లా ఐటీ ఇండస్ట్రీ 25-30 లక్షల ఉద్యోగాలు కల్పించనుందట. ఇదే విషయాన్ని మంత్రి తెలిపారు.

ఎన్డీఏ సర్కారు మూడేళ్ల పాలనలో కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన చర్యలు సాధించిన విజయాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ. ``దేశీయ సాఫ్ట్ వెర్ రంగంలో ఉపాధికల్పన తిరోగమనంలో ఉందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా తిరస్కరిస్తున్నాను. ఇండస్ట్రీ పునాదులు ఇంకా గట్టిగానే ఉన్నాయి. మునుముందు భారీ వృద్ధి నమోదు చేసుకోనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ఐటీ రంగ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. దేశీయ ఐటీ రంగం ప్రత్యక్షంగా 40 లక్షల మందికి పరోక్షంగా 1.3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇండస్ట్రీ ఎగువ ముఖంగానే పయనిస్తోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఐటీ రంగం 20-25 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని నాస్కామ్ అంచనా వేస్తోంది కూడా!`` అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. గడిచిన మూడేళ్లలో ఐటీ కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు కల్పించాయన్నారు.

Related News