//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

Category : business

2018 కొత్త ఐఫోన్‌ మోడల్స్‌ ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్ విడుద‌ల‌ సందర్భంగా పాత ఐఫోన్‌ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది యాపిల్ కంపెనీ. త్వరలోనే ఈ ధరలను భారత్‌లోనూ అమల్లోకి రానున్నాయి .

దేశీయ మార్కెట్‌లోనూ, గ్లోబల్‌గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ 32జీబీ వేరియంట్‌ రూ.29,900కే లభ్యమవుతోంది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ బేస్‌ వేరియంట్‌ ధర కూడా రూ.34,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్‌ కొత్త ధరలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది. భారత్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ అమ్మకాల‌ను నిలిపివేసింది.

ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.95,390 ఉండగా, రూ.91,900 నుంచి ప్రారంభంకానుంది. టాప్‌ ఎండ్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,08,930 ఉండగా, ఇక నుంచి రూ.1,06,900 లభించనుంది.

#Appleiphone #Goognewstoiphoneusers #GoodnewsforiPhonelovers