//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో తీపి క‌బురు..!

Category : politics

ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇది అతిపెద్ద శుభ‌వార్త‌. ఓ ప‌క్క కేంద్ర ప్ర‌భుత్వం విభ‌జ‌న‌తో ఆర్థికంగా, అభివృద్ధిప‌రంగా వెనుక‌బ‌డ్డ ఏపీకి సాయం చేయ‌కుండా వెక్కిరిస్తోంది. మ‌రోప‌క్క రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ జ‌గ‌న్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కేంద్రంలోని బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నారంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియా క‌థ‌నాలు వెల్లువ‌లా ప్ర‌చురిత‌మ‌య్యాయి. అయితే, త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి జ‌గ‌న్‌, అలాగే, ప్యాకేజీల‌కు ఆశ‌ప‌డి ప‌వ‌న్ కేంద్ర ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్క‌య్యారంటూ సోష‌ల్ మీడియాలో వెల‌వ‌డిన క‌థ‌నాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండ‌గా, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ఉన్న విష‌యం తెలిసిందే.

అంతేకాకుండా, సీఎం చంద్ర‌బాబు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంతో విదేశాల్లో ప‌ర్య‌టించి ఏపీకి పెట్టుబ‌డులు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా,ఇప్ప‌టికే పలు కంపెనీలు అమ‌రావ‌తిలో ప్రారంభ‌మ‌య్యాయి కూడాను. అందులో భాగంగా మ‌రో భారీ ప్రాజెక్ట్ ఏపీకి త‌ర‌లివ‌చ్చింది. లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ ప్రారంభం కాబోతోంది. 799 కోట్ల రూపాయ‌ల‌తో తిరుప‌తిలో ఈ కంపెనీ ప్రారంభం కాబోతోంది. ఈ ఒక్క కంపెనీతో మ‌రిన్ని విడి బాగాలు త‌యారు చేసే కంపెనీలు ఏపీకి త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉంది. లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ వారు తొలి విడ‌త‌లో 450 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కంపెనీ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌బోతోంది. ఈలోగా కంపెనీ నిర్మాణాన్ని పూర్తిచేసుకోనుంది.