//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోజు రోజు కి పెరుగుతున్న బంగారం ధర..!

Category : world

పసిడి ధర మళ్లీ పైపైకి వెళ్తొంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు, దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరగడంతోబంగారం మళ్లీ రూ.30వేల మార్క్‌ను తాకి మూడు వారాల గరిష్ఠానికి చేరింది. బుధవారం నాటి మార్కెట్లో రూ.100 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,075గా ఉంది.

అంతర్జాతీయంగానూ 0.14శాతం పెరిగిన బంగారం.. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు ధర 1,284.80 అమెరికన్‌ డాలర్లు పలికింది. ఇక వెండి కూడా నేడు పసిడి బాటే పట్టింది. రూ.380 పెరగడంతో కిలో వెండి ధర రూ.39,250గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువవడంతో ధర పెరిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మూడు వారాల గరిష్ఠానికి చేరుకున్న బంగారం ధర నేడు మరింత పెరిగింది. గురువారం నాటి మార్కెట్లో రూ.175 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.30,250గా ఉంది. బంగారం ధర పెరగడం వరుసగా ఇది ఐదో రోజు. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువ కావడంతో ధర పెరిగినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ.39,500కు చేరింది. ఇక అంతర్జాతీయంగా బంగారం ధర 0.33శాతం పెరిగి సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు ధర 1,291.10 అమెరికన్‌ డాలర్లు పలికింది. వెండి కూడా 0.54శాతం పెరిగింది.

Related News