//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Category : world business

దుబాయ్ లో బంగారం కొనుగోలు చేసే వారికి అక్కడి దుబాయ్ గోల్డ్ అండ్ జువెలరీ గ్రూప్ ఒక శుభవార్త తెలిపింది. దుబాయ్ వ్యాప్తంగా బంగారు నగల అమ్మకాలపై భారీ డిస్కౌంట్ అందించనున్నామని, అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ మొత్తం 65 స్టోర్‌లలో లభిస్తుందని బంగారు నగ కొనుగోలుపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ జూన్8 నుంచి జూలై8 వరకు అందుబాటులో ఉంటుంది.

మరోవైపు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించే స్టోర్‌లలో నగల తయారీపై జీరో పర్సెంట్ మేకింగ్ చార్జెస్ వర్తిస్తాయని షాపింగ్ మాల్స్ యజమాన్యాలు ప్రకటించాయి. పండగ, హలీడే సీజన్‌ను పురస్కరించుకుని వినియోగదారులను ఆకట్టుకునేందుకే ఈ భారీ ఆఫర్ ప్రకటించామని షాపింగ్ మాల్స్ యజమాన్యాలు తెలిపాయి. ఈ ఆఫర్ వల్ల జువెలరీ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని యజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.

Related News