//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మూడోసారి తల్లి కాబోతున్న మాజీ హీరోయిన్

Category : movies

తమిళ తెలుగు భాషల్లో అగ్రహీరోయిన్ గా వెలుగొందిన రంభ మ‌రోసారి త‌ల్లి కాబోతోంది. 2010వ సంవ‌త్స‌రంలో ఇంద్ర‌న్‌ను వివాహ‌మాడిన రంభ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రంభ మ‌రోసారి గ‌ర్భ‌వ‌తి అయింది. ఈ విష‌యాన్ని రంభ స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియ‌జేసింది.

త‌న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన రంభ‌.. మూడో సారి త‌ల్లిన‌వుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంద‌ని కామెంట్ చేసింది. దీంతో అభిమానులు, స‌న్నిహితులు రంభ‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. డెలివ‌రీ సురుక్షితంగా జ‌ర‌గాల‌ని కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గిపోయిన త‌ర్వాత రంభ ప‌లు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ సినిమాతో ఆమె మళ్ళి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని భావిస్తుంది. ఒక కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ ఆమెను సంప్రదించారట.