//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేవుడా ! ఎందుకు ఇలాజరిగింది

Category : state

తన కళ్ల ముందే తల్లి మరణించిందని ఓ కుమారుడి ఆవేదన అందరిని కలవర పెడుతుంది ఈ సమాజం లో తల్లి దండ్రులతో ప్రేమగా ఉండే వాలు చాల తక్కువ మంది ఉంటారు వివరాలోనికి వెళ్తే చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని నారాయణవనం పంచాయతీ దిగువసెంగుంది వీధికి చెందిన మరమగ్గ కార్మికుడు విశ్వనాథ్‌(33). అతనికి తల్లి లలిత(63), భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తోంది. .దగ్గరగా ఉన్నరామగిరి సుబ్రహ్మణ్యేశ్వరస్వామినిఅవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి మంగళవారం దర్శించుకుంటారు.

ఎప్పటిలాగే ఈ మంగళవారం కూడా తన ద్విచక్రవాహనంపై వారు స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున సమయం లో ఈ గోరం జరిగింది ...స్థానికుల కథనం ప్రకారం...మంగళవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై రామగిరిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనానంతరం వారు తిరిగి వస్తుండగా మండలంలోని గోవిందప్పనాయుడుకండ్రిగ సమీపంలో పుత్తూరు-ఊత్తుకోట రహదారిపై చెన్నై నుంచి పుత్తూరు వైపు వెళుతున్న లారీ ఢీకొంది. లలిత అక్కడికక్కడే మృతిచెందగా కొడుకు విశ్వనాథ్‌కు స్పల్పగాయాలయ్యాయి. అతను శిరస్త్రాణం ధరించడంతో అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు.

రహదారి అడుగడుగునా గుంతలు పడి భయంకరంగా ఉంది.. దీనికితోడు లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నాడాం వల్ల ఒక నిండు ప్రాణం బలికొంది .. కొడుకు కళ్ల ముందే తల్లి దుర్మణం చెందింది.. అతని గుండె పగిలే రోదన మిన్నంటాయ హృదయాంధకమైన ఈ సంఘటన అందరిని కలిచివేస్తుంది . . ఎందుకు ఇలా జరిగింది.. దేవుడా! అంటూ పడే ఆవేదనమాటలో చెప్పలేనిది . కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దస్తగిరి తెలిపారు.