రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ స్థాయి కి తగ్గ ఆటతీరును కనబరిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉండాలంటే కచ్చితంగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లనూ నె గ్గాల్సిన దశలో ఎదురొడ్డి నిలిచింది. కోహ్లీ (40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), డివిల్లీర్స్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీం తో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డివిల్లీర్స్కి దక్కింది.
భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన బెంగళూరుకు కోహ్లీ, డివిల్లీర్స్ అండగా నిలిచారు. రెండో ఓవర్లోనే అలీ (1) వికెట్ కోల్పోగా మూడో ఓవర్లో 17 ఏళ్ల నేపాలీ స్పిన్నర్ సందీప్ లామిఛానె.. పార్థివ్ (6)ను ఎల్బీ చేశాడు. అయితే దిగ్గజ జోడీ ఎదురుదాడికి దిగింది. జూనియర్ డాలా ఓవర్లో 4,6,4తో కోహ్లీ కదం తొక్కాడు. ఆరో ఓవర్లో కోహ్లీ మరో సిక్స్, డివిల్లీర్స్ ఫోర్ బాదగా పవర్‌ప్లేలో బెంగళూరు 58 పరుగులు చేసింది. ఇదే ఊపులో కోహ్లీ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
13వ ఓవర్లో కోహ్లీ సిక్స్‌తో పాటు డివిల్లీర్స్ ఫోర్, సిక్స్‌తో చెలరేగి 19 పరుగులు రాబట్టారు. దీంతో 27 బంతుల్లో డివిల్లీర్స్ అర్ధ సెంచరీ పూర్తయ్యింది. లక్ష్యం వైపు చకచకా సాగుతున్న దశలో కోహ్లీని మిశ్రా అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మన్‌దీ్‌ప (13), సర్ఫరాజ్ (11) త్వరగానే అవుట్ అయినా ఆఖరి ఓవర్లో కావాల్సిన 10 పరుగులను డివిల్లీర్స్ రెండు కళ్లు చెదిరే సిక్సర్లతో సాధించి విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మళ్లీ రిషభ్ పంత్ మెరిశాడు. ఇతడి విజృంభణకు చివర్లో 17 ఏళ్ల సంచలనం అభిషేక్ తోడ య్యాడు. 17 ఏళ్ల కుర్ర బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపిన తను సౌథీ వేసిన 17వ ఓవర్లోనైతే వరుసగా 4,6,6తో చెలరేగాడు. చివరి ఓవర్లో 6,4తో ఢిల్లీకి పటిష్ట స్కోరును అందించాడు. ఇతడి ధాటికి బెంగళూరు ఆఖరి 35 బంతుల్లో 65 పరుగులు సమర్పించుకుంది. అంతేకాదు.. 17 ఏళ్ల వయస్సులో అత్యధిక ఐపీఎల్ స్కోరును సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.