//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల్లో పోటీ చెయ్యాలి లోన్ ఇవ్వండి ..బ్యాంక్ లో దరఖాస్తు చేసిన ఓ సామాజిక కార్యకర్త

Category : state politics

ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఓ సామాజిక కార్యకర్త మాత్రం తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను అని అందుకయ్యే ఖర్చు కోసం బ్యాంకు నుండి లోన్ ఇవ్వాలంటూ ఏకంగా బ్యాంకు కి దరఖాస్తు చేసి సంచలనం సృష్టించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ప్రతీ ఒక్కరు సీటు ఖరారు చేసుకునే పనిలోనో..? లేక ప్రచారం ఏర్పాట్లు చేసుకునే పనిలోనో బిజీగా ఉంటే లోన్ కావాలంటూ బ్యాంకు కి దరఖాస్తు చేసిన యాక్టివిస్ట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఓ సోషల్ యాక్టివిస్ట్ కె. వెంకట నారాయణ అందుకు అయ్యే ఖర్చు కోసం బ్యాంకు నుండి లోన్ అడిగారు. అన్ని రంగాల వారికి ఆర్బీఐ రుణాలు ఇస్తుండగా, సామాజిక కార్యకర్తలకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదంటూ వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం రుణాన్ని మంజూరు చేయాలని వెంకట్ నారాయణ కెనరా బ్యాంకు కు దరఖాస్తు చేశారు. వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని బ్యాంకులకు చెల్లించకుండా మోసం చేస్తున్న బడాబాబులకు అడగ్గానే లోన్లు ఇస్తున్నారని, ప్రజాసేవ చేయాలనే ఆశ ఉన్న వారికి లోన్ లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు..

ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సినంత డబ్బు లేదని, ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లోన్ ద్వారా ఇవ్వాలంటూ కెనరా బ్యాంకులో దరఖాస్తు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన వెంకటనారాయణ సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రుణం ఇవ్వాలని నల్లకుంటలోని కెనరా బ్యాంకులో దరఖాస్తు చేశారు.

2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెంకటనారాయణ.. ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కూడా చేశారు. బ్యాంకులను వేల కోట్ల రూపాయలకు మోసం చేస్తున్న వారికో న్యాయం మాకో న్యాయమా అంటూ ప్రశ్నించిన ఆయన, ఎన్నిలలో పోటిచేయడానికి బ్యాంక్ లోన్ ఇవ్వాలని పార్లమెంట్లో బిల్లు పెట్టి అమలు పరచాలని కోరుతున్నానన్నారు .