//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పారికర్ వ్యాఖ్యలకు బీర్ తాగుతూ ఫోటోలు పెడుతున్న అమ్మాయిలు..!

Category : national

అమ్మాయిల్లో మందు కొట్టే అలవాటు పెరిగిపోయిందని,బీరును అధికంగా తాగుతున్న అమ్మాయిలను చూస్తుంటే తనకెంతో భయం కులుగుతోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంటోంది.

అమ్మాయిలు పరిధులను దాటుతున్నారని పారికర్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పలువురు 'గార్ల్స్ హూ డ్రింక్ బీర్' (#GirlsWhoDrinkBeer) హ్యాట్ ట్యాగ్ జోడిస్తూ,పారికర్ వ్యాఖ్యలపై మండిపతుతున్నారు.

అమ్మాయిలు బీరు తాగడాన్ని మాత్రమే చూశానని ఆయన చెబుతున్నారని,ఇక మహిళలు పోర్న్ మూవీస్ చూస్తారని,సిగరెట్లు తాగుతారని ఆయనకు తెలిస్తే నెలల తరబడి నిద్రపోరేమోనని ఒకరు.ప్రధాని మహిళను చూసి నవ్వుతారు,పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు,యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు వీరా మన పాలకులు అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

పారికర్ కు ఎనిమిది నెలల పాటు రేప్ నకు గురైన అమ్మాయి సంగతి తెలియదా,పరువు హత్యలు కనిపించడం లేదా,పట్టపగలు బస్సుల్లో లైంగిక వేధింపులు తెలియవా, అవన్నీ పారికర్ ను భయపెట్టవా అని కూడా కామెంట్లు వస్తున్నాయి.ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టం అంటూ పలువురు అమ్మాయిలు బీరు తాగుతున్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు.

Related News