//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లైంగిక వేధిములకు పాల్పడ్డ స్వామిజిపై తిరగబడ్డ యువతి

Category : national

కొద్దీ రోజులుగా  లైంగికంగా వేధిస్తున్న ఒక  స్వామీజీ వేధింపులను తట్టుకోలేక ఒక యువతీ అతని  పురుషాంగాన్ని కోసేసిన స్సంఘటన కేరళలో జరిగింది. ఆ యువతీ చర్యను సాహోసేపేతం అంటూ రాష్త్ర ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ స‌మ‌ర్థించారు.

కొల్లాంలో గల పన్‌మానా ఆశ్రమానికి చెందిన వ్యక్తి గంగానందా తీర్థపాదా అలియాస్ హరిస్వామి. గత ఐదేళ్లుగా మహిళ కుటుంబ సభ్యులు గంగానందాకు తెలుసు. పూజలు నిర్వహించేందుకు గాను ఇతను మహిళ ఇంటిని తరచూ సందర్శిస్తుండేవాడు. 

కాగా గత రెండు రోజులుగా గంగానందా యువతిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వస్తాడని తెలియడంతో యువతి చేతిలో కత్తితో సిద్ధంగా ఉంది. ఊహించిన విధంగానే ఇంటికి వచ్చిన గంగానందా యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో యువతి అతడి అంగాన్ని కట్‌చేసింది. 

ఆ యువతీ కుటుంభం సభ్యులు ఆ స్వామి ని తిరువనంతపురం వైద్య కళాశాలకు ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన హరిస్వామిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ లు తెలిపారు. కాగా బాలికకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.