//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియోనీ ఫోన్ ఉంటే జియో నుంచి ఫ్రీ డేటా

Category : business

మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ రిలయన్స్ జియో, పేటీఎం సంస్థలతో భాగస్వామ్యం అయి యూజర్లకు పలు ఆఫర్లను అందిస్తున్నది. జియోనీ ఫోన్లలో జియో సిమ్‌లను వాడుతున్న వారు రూ.309 ఆపైన ప్యాక్‌లను రీచార్జి చేసుకుంటే దాంతో వారికి ఉచితంగా 4జీ డేటా లభిస్తున్నది. జియోనీ పీ5ఎల్, పీ7 ఫోన్లను వాడుతున్న వారికి 2జీబీ 4జీ డేటా లభిస్తుండగా, ఇలైఫ్ ఎస్6, ఇలైఫ్ ఎస్7, మారథాన్ ఎం5, ఎస్ ప్లస్, ఎస్6ఎస్, ఎఫ్103 ప్రొ, ఎం5 లైట్ సీడీఎంఏ, మారథాన్ ఎం4, మారథాన్ ఎం5 లైట్, పీ7 మ్యాక్స్, ఎఫ్103 ఫోన్లను వాడుతున్న వారికి 5జీబీ 4జీ డేటా, ఎ1, ఎం5 ప్లస్, ఎస్6 ప్రొ, ఇలైఫ్ ఇ8 ఫోన్లను వాడుతున్న వారికి 10 జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తున్నది. అయితే ఈ ఫోన్లను వాడుతున్న వారు మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 6 సార్లు రీచార్జి చేసుకోవచ్చు. దీంతో వారికి రూ.309 ఆపైన రీచార్జి చేసుకున్నప్పుడల్లా పైన చెప్పిన విధంగా అదనపు 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఇక కొత్తగా జియోనీ ఎ1 లేదా పీ7 మ్యాక్స్ ఫోన్లను కొనే వారికి రూ.250 విలువ గల పేటీఎం వాలెట్ వోచర్లను జియోనీ అందిస్తున్నది.