//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియోనీ స్మార్ట్ ఫోన్ కు భారీ బుకింగ్స్

Category : business state national

జియోనీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏ1 బుకింగ్స్ లో అదరగొడుతోంది. రిబిగ్ బ్యాటరీ, సెల్ఫీ ఫోకస్డ్ గా ఈ ఫోన్ వినియోగదారులను అలరించడానికి మార్కెట్లోకి వచ్చింది. 4010 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. దీంతో పాటు సెల్ఫీ ఫ్లాష్ ను కూడా 16ఎంపీగా ఉండేటట్టు ఈ ఫోన్ ను కంపెనీ రూపొందించింది.రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన 10 రోజుల్లోనే 150 కోట్ల విలువైన జియోనీ ఏ1 స్మార్ట్ ఫోన్లు బుకింగ్ అయినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇన్ని బుకింగ్స్ నమోదైన తొలి స్మార్ట్ ఫోన్ తమదేనని, మొత్తం 74,682 యూనిట్ల ప్రీఆర్డర్లను స్వీకరించినట్టు కంపెనీ తెలిపింది. 8 వేల ధర నుంచి 25వేల ధర మధ్యలో ఉన్న ఫోన్లకు ఎక్కువగా బుకింగ్స్ నమోదవుతున్నాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ ఆర్ వోహ్రా చెప్పారు.