//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబు పిలుపు కోసం వెయిట్ చేస్తున్న జాతీయ పార్టీ నేత‌..!

Category : state politics

చంద్ర‌బాబు ఎదురుప‌డ్డాడు.. విష్ చేశాదు. ఆల్రెడీ రిపోర్టు కూడా ఇచ్చేందుకు సిద్ధ‌మయ్యాడు. కేంద్ర‌మంత్రి హోదాలో ఏపీ వ్య‌వ‌హారాలు తెలిసిన నాయ‌కుడిగా ఆజాత్ క‌నీసం ప‌ట్టించుకోలేదు. అయినా, రాష్ట్రం కోసం ప‌ట్టు విడ‌వ‌న‌ని, బెడ్టుస‌డ‌ల‌ని పోరాటం చేశాడు బాబు. అప్పుడు ప‌ట్టించుకోని ఆజాద్‌.. ఇప్పుడు చంద్ర‌బాబుతో మాట్లాడేందుకు ఎంత‌గా వెంప‌ర్లాడాడో తెలుసా..? ఇంత‌కీ ఆజాద్ అంత‌లా వెంప‌ర్లాడ‌టానికి కార‌ణం ఏమిటంటే..!Ghulam Nabi Azad waiting for Chandrababu Naidu Appointment

చంద్ర‌బాబు లైట్ హౌస్‌లాంటోడ‌ని తెలుగు త‌మ్ముళ్లు చెప్పుకుంటుంటారు. బ‌ట్ట‌లు ఎండేసుకునేందుకు పాత‌దండెం క‌ర్ర‌లాటి వారు కూడా ఒక్కోసారి బాబుతో పోల్చుకోవ‌డానికి పోటీ ప‌డుతుండ‌టం చూస్తూ ఉంటాం. స‌రిగ్గా ఐదారేళ్ల నాడు కాంగ్రెస్‌లో ఆజాద్ లాంటి నాయ‌కులు కూడా అలాగే ప్ర‌వ‌ర్తించారు. అంతా త‌మ చేతుల్లోనే ఉన్న‌ట్టు, త‌మ చేతుల్లోనే  అయిపోతున్న‌ట్టు అనుకున్నారు. తీరా ఏపీ గిరాటేస్తే గ‌ల్లంతైపోయారు. Ghulam Nabi Azad waiting for Chandrababu Naidu Appointment

అప్ప‌ట్లో ఢిల్లీలో చంద్ర‌బాబు పోరాటం చేశాడు. రిపోర్టు ఇవ్వాల‌నుకున్న‌ది కూడా ఆజాద్‌కు కాదుకానీ, కేంద్రానికి, ఏపీ తెలంగాణ విభ‌జ‌న గ‌నుక అనివార్య‌మైతే..రెండు ప్రాంతాల‌కు న్యాయం చేయండి అంటూ రిపోర్టు ఇవ్వ‌బోయాడు. అలాంటిది కాంగ్రెస్ నాయ‌కులు మినిమ‌మ్ కూడా ప‌ట్టించుకోలేదు. ఇష్టారీతిన తోసేశారు. అది చ‌రిత్ర‌, ఇప్పుడు చ‌క్రం తిరిగింది. చంద్ర‌బాబు రెండు రాష్ట్రాల‌కే కాదు, దేశానికే రాజ‌కీయ దిశానిర్దేశం చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. Ghulam Nabi Azad waiting for Chandrababu Naidu Appointment

ఇదిలా ఉండ‌గా, కాంగ్రెస్ నేత ఆజాద్ ఇప్పుడు చంద్ర‌బాబును క‌ల‌వాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పొత్తు విష‌యం దాదాపు ఖ‌రారైపోయింది. మ‌రిన్ని సీట్ల వ్య‌వ‌హారం సాగుతోంది. స్ర్టాట‌జీ విష‌యంలో కూడా ఆయ‌న్ను సంప్ర‌దించాల‌నుకున్నాడు. కానీ, చంద్ర‌బాబు సుముఖంగా లేరో.. లేక బిజీగా ఉన్నారో తెలీదు. మాట్లాడ‌టం కుద‌ర‌ద‌ని ఆజాద్‌కు వెన్నంటి ఉడే తెలంగాణ నాయ‌కుడు ఒక‌రు చెప్పారు. Ghulam Nabi Azad waiting for Chandrababu Naidu Appointment

Related News