//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికలల్లో డబ్బు పంచితే ...ఐదేళ్ల జైలు శిక్ష

Category : national

ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లంచం ఇవ్వటానికి ప్రయత్నించే అభ్యర్థులను ఐదేళ్ల పాటు ఎన్నికలలో పోటీచేయడానికి అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. తమిళనాడులో ఇటీవల ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు మరియు వివిధ రూపాలలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదన చేసింది. కేంద్రం ఆమోదిస్తుందో ,లేదో తెలియదు కానీ, ఈ ప్రతిపాదన మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అదీగాక ఇది దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఎంత మంది అభ్యర్ధులు ఓటర్లకు డబ్బు, ఇతర ఆకర్షణలు ఇవ్వకుండా ఉంటున్నారన్న ప్రశ్న కూడా వస్తుంది.ఆలోచన ఉద్దేశం మంచిదే అయినా, ఒకటికి,రెండుసార్లు ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.