Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుదిబండగా జీఎస్టీ.. గుజరాత్ ఎన్నికల కోసం ఉపశమన చర్యలు

Posted 3 months ago | Category : national

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కేంద్ర సర్కారుకు గుదిబండాలా తయారైనట్టు కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న జీఎస్టీ విషయంలో ఇటు వర్తకుల్లోనూ.. అటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతోంది. దేశ వృద్ధి రేటు పడిపోతుండడంతో పాటు..

ప్రతిపక్షాల విమర్శలు తారా స్థాయికి చేరుతుండడంతో సర్కారు పునరాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. మరోవైపు తమ ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలుగుతోందని పలు రాష్ట్రాలు ఇప్పటికే బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ మాటలు నమ్మి జీఎస్టీ మార్పులకు తలాడిస్తు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇక మోడీ సర్కారుతో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకుంటున్నాయి. రానున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తమ వాదనను బలంగానే వెల్లగక్కాలని యోచిస్తున్నాయి. ఈ విషయాన్ని పలు రాష్ట్రాలు ఇప్పటికే బాహాటంగానే వెల్లడించాయి. దీంతో రాష్ట్రాలు గనుక జీఎస్టీ విషయంలో తిరగబడితే.. మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న సర్కారు వారిని శాంతిపజేసేలా పరోక్ష ప్రయత్నాలను మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది.

స్వయంగా ఊరట సంకేతాలిచ్చి ప్రధాని

వర్తకులకుపై జీఎస్టీ పన్ను భారం తగ్గించేలా త్వరలో చర్యలు చేపట్టునున్నట్టుగా ప్రధాన మంత్రి మోడీ వెల్లడించారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రాల మధ్య ఏకాభ్రిప్రాయం కుదిరితే వర్తకులకు మేలు చేసేలా.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా జీఎస్టీలో నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా ఆయన వివరించారు. చిన్న వ్యాపారస్తులపై జీఎస్టీ భారం తగ్గించే ఆర్థికానికి మేలు చేసేలా ఇప్పటికే మంత్రల ప్యానెల్‌ పలు సూచనలు చేసిందని ఆయన అన్నారు. వీటిని కౌన్సిల్‌ చర్చించనున్నట్టుగా వివరించారు. ఇందులో భాగంగా జీఎస్టీ పన్ను విధించే పరిమితిని మరింత పెంచే యోచన కూడా ఉన్నట్టుగా సమాచారం. ప్రపంచ బ్యాంకు తాజాగా సిద్ధం చేసిన వ్యాపారానుకూలత దేశాల జాబితాలో భారత్‌ 30 స్థానాలు ఎగబాకడాన్ని మోడీ తమ సంస్కరణ ఫలంగా వెల్లడించారు. వచ్చే ఏడాది జీఎస్టీతో పాటు ఇతర సంస్కరణలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఏడాది మరింత మెరుగై ర్యాంకింగ్‌ లభించే అవకాశం ఉన్నట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటికే పలు సంస్కరణలను చేపట్టడం జరిగిందని వాటి ఫలాలు అందేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు.

గుజరాత్‌ ఎన్నికల నేపథ్యమూ కారణమా..

దేశంలో వర్తక, వ్యాపారులు అధికంగా ఉండే గుజరాత్‌ రాష్ట్రంలో ప్రజలు జీఎస్టీ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారు జీఎస్టీపై అవగాహన లేక, సరైన ఆర్డర్లు చేతికి అందక దాదాపు మూత పడే స్థాయికి చేరుకున్నారు. చాలా వరకు వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. ఇదే అంశం ఇప్పుడు అక్కడి ప్రధాన ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. దీంతో ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని మాటిమాటికి లేవనెత్తుతుండడంతో.. మోడీ సర్కారు నష్ట నివారణ చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా వచ్చే వారం వర్తకులకు, ప్రజలకు మేలు చేసేలా కొత్త జీఎస్టీ పన్ను నిర్మాణంలో, శ్లాబుల్లో పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సర్కారు సంకేతాలు అందిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !