Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జీనియస్ హీరో "సెవెన్ " సినిమా రివ్యూ.....!

Category : movies

న‌టీన‌టులు: హ‌వీష్,నందితా శ్వేత‌, రెజీనా, పూజిత పొన్నాడ‌, రెహ‌మాన్, అదితి ఆర్య‌ త‌దిత‌రులు ఉన్నారు.

స్టోరీ ,స్క్రీన్ ప్లే : రమేష్ వ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌కుడు: నిజార్ ష‌ఫీ

జీనియ‌స్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హ్యాండ్ సమ్ యంగ్ హీరో హ‌వీష్. తాను నటించిన సినిమాలు తక్కువే అయిన నటన పరంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతగానో ప్ర‌య‌త్నిస్తూన్నడూ ఈ యంగ్ హీరో. తాజగా ఈ హీరో నటించిన సెవెన్ అనే క్రైమ్, త్రిల్లర్ మూవీ రిలీజ్ కావడం జరిగింది.పూర్తి ప్ర‌యోగాత్మకంగా ఈ సినిమా ధియేటర్స్ లో అడుగుపెట్టింది. అయితే నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం......?

స్టోరీ:

కార్తిక్(హ‌వీష్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా పనిచేస్తూ ఉంటాడు.ఈ సమయంలోనే పెళ్లి చేసుకుని హాయిగా తన జీవితం గ‌డుపుతుంటాడు. అంత‌లోనే త‌న భ‌ర్త కార్తిక్ మిస్ అయ్యాడంటూ నందితా శ్వేత వ‌చ్చి పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తుంది. దానికంటే ముందే మ‌రో అమ్మాయి కూడా ఇదే తీరులో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. ఇలాంటి కేసులే చెన్నై నగరంలో మరిన్ని కంప్లైంట్ స్ నమోదు కావడం . దాంతో అమ్మాయిల‌ను మోసం చేస్తూ పెళ్లి చేసుకునే వాడిగా కార్తిక్ కేస్ ఫైల్ చేసి ధ‌ర్యాప్తు మొద‌లుపెడ‌తారు పోలీసులు. కానీ అప్పుడే కార్తిక్ జీవితంలోకి స‌రస్వ‌త‌మ్మ‌(రెజీనా) వ‌స్తుంది. అస‌లు కార్తిక్ ఇలా మారిపోవ‌డానికి అసలు కార‌ణం ఆమె అని తెలుస్తుంది.ఈ నేపధ్యంలోనే ఈ అసలు కదా వెన‌క కారణాలు ఏమిటి అనేదే అస‌లు స్టోరీ..

కథనం విషయానికి వస్తె.....!

సాధార‌ణంగా సైకో ల‌వ్ స్టోరీస్ అనేవి ఎప్పుడూ మేల్ డామినేటెడ్‌గానే ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం విచిత్రంగా అమ్మాయి వైపు నుంచి ఈ క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు నిజార్ ష‌ఫీ. సెవెన్ క‌థ మొద‌టి 20 నిమిషాలు చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇలా సినిమా మొద‌ట్లోనే మూడు మ‌ర్డ‌ర్స్.. ఆ వెంట‌నే భ‌ర్త మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ‌న్నీ ఈ సినిమాపై మరింత ఆస‌క్తి పెంచేస్తాయి. కానీ ఆ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు నిజార్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఒక్క‌సారి కార్తిక్ కారెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. అదే స్పీడ్‌తో సినిమా ముందుకెళ్ల‌లేక‌పోయింది. భ‌ర్త మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చిన త‌ర్వాత రొమాన్స్, ల‌వ్ ట్రాక్ రావ‌డం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

అయితే అదే ఊపులో ఈ సినిమా కథ కొనసాగలేక పలు చోట్ల చతికిల పడింది.అంతే కాకుండా మ‌ళ్లీ అదే రేంజ్ లో స‌స్పెన్స్ కొనసాగించడం లో స్టోరీ టేకింగ్ లో పలు లోపాలు కనిపిస్తాయి.. అసలు హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు.. నిజంగానే అమ్మాయిల‌ను మోసం చేస్తున్నాడా....? అనే కోణంలో కాకుండా క‌థ‌ను రొమాన్స్ అంటూ ప‌క్క‌దారి ప‌ట్టించే స‌రికి ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి ఈ సినిమా పై ఆస‌క్తి త‌గ్గిపోతుంది. సెకండాఫ్ లో వచ్చే 1980 ఫ్లాష్ బ్యాక్ అంత బాగా ప్రేక్షకులకు గ్రిప్పింగ్‌గా ఉండదు. రెజీనా ఉన్నంత సేపు బాగానే ఉన్నా ఆ త‌ర‌హా ప్రేమ‌క‌థ‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ అవుతాయ‌నేది మాత్రం ప్ర‌శ్నార్థ‌క‌మే. సైకోయిక్ ప్రేమికురాలిగా రెజీనా కొత్త‌గా ట్రై చేసింది కానీ అది పెద్ద‌గా పనిచేయలేదు. మొత్తానికి సినిమా యావరేజ్ గా కొనసాగుతూ ఈ సినిమా చూసే ప్రేక్షకులను అలరించడం కాస్త వెనక పడింది అనే చెప్పుకోవాలి.

Related News