Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రారంభమైన తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్..

Category : state politics

దేశ వ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ లోక్‌సభ ఎన్నికల బరిలో 1,280 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో పోలింగ్‌కు సంబంధించి లక్షా 10వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 20 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.