//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గీత గోవిందం టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ లిస్ట్‌..!

Category : movies

విజ‌య్‌దేవ‌ర‌కొండ, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో వ‌చ్చిన లేటెస్ట్ సెన్షేష‌న్ మూవీ గీత గోవిందం. ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద టోట‌ల్‌ర‌న్‌ను ముగించుకుంది. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఓవ‌రాల్‌గా రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ద‌క్కించుకున్న ఈ సినిమా 16 కోట్ల టార్గెట్‌లో బ‌రిలోకి దిగ‌గా టోట‌ల్‌గా ఏరియాల వారీగా సాధించిన క‌లెక్ష‌న్ల వివ‌రాలిలా ఉన్నాయి.

నైజాం 20.2 కోట్లు,

సీడెడ్ 6.7 కోట్లు,

కృష్ణా 3.67 కోట్లు,

ఉత్త‌రాంధ్ర 9.51 కోట్లు,

ఈస్ట్ 4.1 కోటి,

వెస్ట్ 3.15 కోట్లు,

గుంటూరు 3.9 కోట్లు,

నెల్లూరు 1.7 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసిన ఈ సినిమా ఓవ‌రాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల‌లో 49.33 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది.

ఇక క‌ర్ణాట‌క‌లో 6.1 కోటి, త‌మిళ‌నాడులో 2.4 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసిన ఈ సినిమా అమెరికాలో 10.6 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసింది.

ఇక రెస్టాఫ్ ఇండియా మ‌రి, రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ మొత్తం మీద క‌లిపి 2 కోట్ల వ‌ర‌కు షేర్‌ను సాధించింది. ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా 70.43 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసింది.