//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గీత గోవిందం లీక్.....ట్విట్టర్ లో స్పందించిన విజయ్....!

Category : movies

గీత గోవిందం సినిమా రిలీజ్ కు ముందే లీక్ కావడంపై ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ పరోక్షంగా స్పందించాడు. నేను చాలా నిరాశకు లోనవుతున్నా. ఐ హర్ట్. ఒకసారి కోపం వస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తుంది అని ట్వీట్ చేశాడు.

దీంతో విజయ్ ఈ ట్వీట్ ను ఎందుకు చేశాడబ్బా అని పలువురు ఇంటర్నెట్ లో చర్చించుకున్నారు. సినిమా లీక్ వ్యవహారంతో బాధపడి విజయ్ ఈ ట్వీట్ చేసుంటాడని నెటిజన్లు అనుకుంటున్నారు.

దీంతో కొందరు అభిమానులు.. ఎన్ని లీకులు ఎదురైనా మనకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని విజయ్ కు ధైర్యం చెప్పారు. చిల్ రౌడీ.. లైట్ తీసుకో అంటూ విజయ్ ను ఓదారుస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గుంటూరులోని కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల వద్ద సినిమా దొరకటంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సినిమా ఎడిటింగ్ విభాగం నుంచే లీకయిందని తేలింది.

Related News