//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజమౌళి ఒక్క మాటతో సినిమా కలెక్షన్స్ నీ మార్చేసాడు

Category : movies

బాహుబలితో సినిమాతో టాలీవుడ్ రేంజ్ నీ తారా స్థాయికీ తీసుకుని వెళ్ళాడు మన జకన్న. సాదారణం గా తనతో సినిమా తీస్తే నిర్మాతలకు కలెక్షన్స్ సునామిలా వస్తాయి..కానీ ఇక్కడ రాజమౌళి ఒక్క మాట తో సినిమారేంజ్ నే మార్చేసాడు.. రౌడీ స్టార్ దేవరకొండ, చలోఫేం రష్మిక హీరో హీరోయిన్స్ గా చేసిన సినిమా గీతా గోవిందం. ఫామిలీ డైరెక్టర్ పరశురాం డైరక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అర్జున్ ఫ్రెండ్ బన్ని వాసు ఈ మూవీని నిర్మించారు. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా చాలా బాగుంది అని యూనిట్ మొత్తని తెగ పొగిడాడు ..ఇంకా అంతే..సంచలన విజయం అందుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా గీతా గోవిందం సూపర్ హిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమా తర్వాత విజయ్ గోవిందంగా అలరించాడు.

ఇక ఈ సినిమా ఈప్పటి వరుకు మొదటి రోజు 5 కోట్లు, రెండో రోజు 4 కోట్ల దాకా కలెక్ట్ చేయగా ఏకంగా మూడు రోజుల్లో 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కు దగ్గరగా వచ్చిందని తెలుస్తుంది. పెళ్లిచూపులు 1.3 మిలియన్, అర్జున్ రెడ్డి 2 మిలియన్స్ కలెక్ట్ చేయగా గీతా గోవిందం కూడా ఓవర్సీస్ లో 2 మిలియన్ కలెక్ట్ చేసేలా కనబడుతుంది.

ఈ సినిమా కలక్షన్స్ తో విజయ్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. కలక్షన్స్ దూకుడు చూస్తుంటే 30 కోట్లు చాలా ఈజీగా సాధించేలా ఉంది. శైలజా రెడ్డి అల్లుడు వచ్చే దాకా గీతా గోవిందం కలక్షన్స్ ను అడ్డుకునే వారే లేరని చెప్పొచ్చు.