పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు, భారత ఆటగాళ్లతో మధ్య సత్సంబంధాలు ఉండవని అందరు భావిస్తారు. కానీ పాక్ ఆటగాళ్ల కి భారత ఆటగాళ్లకి మధ్య చాలా వరకు మంచి సంబంధాలు ఉంటాయని పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది అన్నారు. " నాకు చాలా మంది భారత క్రికెటర్లతో మంది రిలేషన్ ఉంది. కానీ గంభీర్ తో మాత్రం తనకు అంత చనువు లేదన్నారు. కొన్నేళ్ల క్రితం మైదానంలో మేమిద్దరం తీవ్రంగా వాదించుకున్నాం. అది ప్రపంచవ్యాప్తంగా పతాక స్థాయికి చేరింది. ఇలాంటివి జీవితంలో భాగమని ఆ గొడవ గురించి నేను మరిచిపోయా. గంభీర్ మాత్రం మరిచిపోలేదు. గంభీర్ అంత స్నేహశీలి కాదు’’ అని అఫ్రిది చెప్పాడు.