//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన భీమిలి టికెట్ ... గంటా వర్సెస్ అవంతి

Category : state politics

వారిద్దరూ మంచి స్నేహితులు... అంతకుమించి గురుశిష్యులు... అటువంటి వారి మధ్య కూడా రాజకీయాలు చిచ్చు పెట్టాయి. గురువుపై శిష్యులు పోటీకి సిద్ధమయ్యేలా చేశాయి. ఇరువురి మధ్య టికెట్ వివాదం రేపింది. నిన్నటి వరకు స్నేహం తో కలిసిమెలిసి ఉన్న వీరు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటే భీమిలి బరిలో నిలవనున్నారు.

అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు.. ఇద్దరూ మంచి మిత్రులు. అంతకు మించి గురు శిష్యుల బంధం వీరిది. విద్యాసంస్థలను చూసుకుంటున్న అవంతి శ్రీనివాసరావును ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి పోటీ చేయించారు గంటా శ్రీనివాసరావు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం జరిగాక అవంతి, గంటా ఇద్దరూ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తన గురువు గంటా శ్రీనివాసరావు కోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిని వదిలి.. అనకాపల్లి ఎంపీగా అవంతి శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

అయితే అవంతికి మొదటి నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని బలంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో 2014లో పార్లమెంట్‌కు వెళ్లారు. 2019లో తాను భీమిలి నుంచి తిరిగి పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో అనేక సార్లు చెప్పారు కూడా. ముఖ్యంగా అవంతి విద్యా సంస్థలు అక్కడే ఉండటం తాను ఇంతకు ముందు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం.. తాను గతంలో చేసిన అభివృద్ది ...అన్నింటికి మించి తన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండటంతో .. అవంతి భీమిలి నుంచే పోటీ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు...

ఇక అదే స్థానం నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నా రు. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నగంటా శ్రీనివాసరావు మంత్రి హోదాలో భీమిలి అభివృద్ధికి కృషి చేశారు. ఈ నేపధ్యంలో తాను భీమిలి నుంచే పోటీ చేయాలనే అలోచనలో ఉన్నారు. అవంతి శ్రీనివాస్ తాను ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతానని భీమిలి నుంచి పోటీ చెస్తానని అవంతి తెలుగుదేశం అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో అవంతిపై గంటా అలక బూనారు.. ఒక దశలో వీరిరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చిన్నరాజప్ప రాయబారం చేశారు.. దీంతో అధిష్టానం గంటాకే తిరిగి సీటు ఇస్తానని తేల్చి చెప్పింది.

దీంతో అవంతి శ్రీనివాస్ భీమిలి నుండి పోటీ చేయడం కోసమే వైసిపి బాట పట్టారు.ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు అఫీషయల్‌గా టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు భీమిలి టిక్కెట్ కన్ఫామ్ చేశారని సమాచారం. ఇప్పటికీ వైసీపీకి భీమిలిలో సరైన నేత లేరు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిపై 40 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు గంటా. తనకు సరైన ప్రత్యర్ధి లేకపోవడంతో ఈసారి కూడా 80 వేలకు పైగా మెజారిటీ సాధిస్తానని గంటా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా .. భీమిలిలో నివాసం ఉండేదీ తక్కువ. ఇన్చార్జులతోనే కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. అవంతికి భీమిలిలో మంచి పట్టుంది. దీంతో గంటా వర్గం లో కలవరం మొదలైంది. ఇక గురుశిష్యులు ఇద్దరూ భీమిలిలో పోటీకి దిగితే రసవత్తర పోరే జరగనుంది.