మహేంద్ర సింగ్ ధోనీ నేడు దిగ్గజ బ్యాట్స్‌మన్‌గా ప్రఖ్యాతిగాంచాడంటే అందుకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ యే కారణమన్నాడు సెహ్వాగ్. తన బ్యాటింగ్ ఆర్డర్‌ను ధోనీ కోసం గంగూలీ త్యాగం చేసి ఉండకపోతే మహీ గొప్ప బ్యాట్స్‌మన్ కాకపోయి ఉండేవాడని అని కుండ బద్ధలుగొట్టాడు. ‘ఆ సమయంలో మేం బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేస్తున్నాం. ఓపెనర్లు కనుక చక్కటి భాగస్వామ్యం నమోదు చేస్తే సౌరవ్‌ను మూడో నెంబర్లో పంపాలని నిర్ణయించాం. ఒకవేళ ఓపెనర్లు విఫలమైతే స్కోరులో వేగాన్ని పెంచేందుకు పించ్ హిట్టర్ ఇర్ఫాన్ పఠాన్ లేదా ధోనీల్లో ఒకరిని పంపాలనుకున్నాం’ అని ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ వెల్లడించాడు. ఇలా ఓ యువ ఆటగాడికోసం గంగూలీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవడం అది రెండోసారి. మొదటిసారి.. సెహ్వాగ్కోసం సౌరవ్ తన ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేయడం గమనార్హం.