//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పంజాబ్ లో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన

Category : national

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.

భార్య నుంచి బలవంతంగా విడాకులు పొందేందుకు ఓ భర్త తన స్నేహితులతో సామూహిక అత్యాచారం చేయించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని లుధియానాలో బాధితురాలు మూడేళ్లక్రితం కూలీ పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరికీ అది రెండో వివాహం కావడం విశేషం.

పిల్లలు కనడం ఇష్టం లేని ఆ వ్యక్తి బాధితురాలికి 8 సార్లు అబార్షన్ చేయించాడు. అనంతరం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించాడు. అనంతరం విడాకులివ్వాలని ఆమెను వేధించసాగాడు. అయితే అతని కోసం పలు త్యాగాలు చేసిన ఆమె విడాకులకు నిరాకరించింది.

దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సదరు భర్త...గత జూన్ 6న తన ముగ్గురు స్నేహితులను ఆమె గదిలోకి పంపి తాళం వేశాడు. దీంతో రెచ్చిపోయిన ఆ కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఇది మరోసారి వివాదంగా మారడంతో సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.