//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ లో ప్రకంపనలు... జూనియర్ ఆర్టిస్ట్‌పై గ్యాంగ్ రేప్

Category : movies

సినిమా అవకాశాలు లేనివారిని ఆదుకోవడానికి జూనియర్ ఆర్టిస్టులైన ఓ యువతి, యువకుడు ఒకటయ్యారు. ఓ సంస్థను ఏర్పాటు చేసి అవకాశాలు లేని వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు . ఆ సంస్థ సభ్యత్వం పేరిట వసూలు చేసిన డబ్బుల విషయంలో వివాదం వచ్చింది.

ఈ వివాదం పెరగడంతో ఆ యువకుడు పథకం పన్నీ, మరో ముగ్గురితో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరుకు చెందిన శిరిష, హేమ లంగర్‌హౌస్‌లో ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దికాలం క్రితం ఆ యవతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్‌లో చేరాడు. వేశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరు ‘మన’ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేశారు అని సమాచారం.

సభ్యత్వం పేరుతో కొంత డబ్బు వసూలు చేశారు. ఆ లెక్కల విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇది మనసులో పెట్టుకున్న రాజ్‌కిరణ్.. యువతి, శిరీష, హేమలను ఈ ఏడాది మార్చి 5న గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. ఆ సమయంలో శిరీష, హేమ, ఆ యువతికి శీతలపానియంలో మత్తు కలిపి ఇచ్చారు. ఆమె సృహతప్పి పడిపోగానే రాజ్‌కిరణ్‌తో పాటు మరో ముగ్గురు లైంగిక దాడి చేశారు.

ఐతే అవకాశాలు తగ్గిపోతాయని ఆ యువతి నిమ్మకుండి పోయింది. కొద్ది రోజులగా రాజ్‌కిరణ్ తన వద్ద రేప్‌కు సంబంధించి చిత్రాలున్నాయని, వాటిని ఇంటర్నెట్‌లో పెడుతానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో రాజ్‌కిరణ్‌పై గతంలో సదరు యువతి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై లంగర్‌హౌస్‌లోనూ బెదిరింపుల కేసు నమోదైందని తేలింది.

టాలీవుడ్ లో వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియక టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.