//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గల్లా దెబ్బ కి దద్దరిల్లిన పార్లమెంట్... గల్లా స్పీచ్‌ హైలైట్స్.....!

Category : politics

అవిశ్వాస తీర్మానం పై ఈ రోజు చర్చ ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ దద్దరిల్లేలా తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇటీవలి బ్లాక్ బస్టర్ హిట్ 'భరత్ అనే నేను' ప్రస్తావనతో ఆసక్తికరంగా ప్రారంభించారు ఎంపీ గల్లా జయదేవ్. తరువాత తన ప్రసంగంలోని ముఖ్యమైన ఘట్టాన్ని ప్రారంభించారు.

అయన బీజేపీ వైఖరిని తప్పుబట్టారు 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏపీ ఇష్యూ మొత్తం దేశానికే ఇష్యూగా మారిపోయిందని అన్నారు. ఇది బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం కాదని, ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధమని, మోదీ పాలనకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ను పార్లమెంట్ తలుపులు మూసి అశాస్త్రీయంగా విభజించి కాంగ్రెస్ పార్టీ అపరాధం చేస్తే, నాడు కాంగ్రెస్ కు సహకరించి, ఆపై అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు ఏపీ నడ్డి విరిచిన బీజేపీ మహాపరాధం చేసిందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ నిప్పులు చెరిగారు.

ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్‌ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని పేర్కొన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు.

రాజ్యసభలో ఆనాడు ప్రధాని మన్మోహన్‌ ఆరు హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హామీలు ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు.

ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని 2018లో జైట్లీ తేల్చి చెప్పారన్నారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమకు లేదా అని గల్లా ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు....చూడాలి మరి గల్లా ప్రసంగంతో అయిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం లో చలనం వస్తుందేమో....................