//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలీసులు అడుగు పెట్ట‌లేని చోట దాక్కున్న గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి..!

Category : politics

మైనింగ్ డాన్ గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి కోసం గాలింపు ముమ్మ‌ర‌మైంది. బెంగ‌ళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి కోసం జ‌ల్లెడ‌ప‌డుతున్నారు. కేసు విచార‌ణ‌లో త‌న‌పై ఆధారాలు సేక‌రించ‌కుండా ఉండేందుకు ఈడీ అధికారికి కోటి రూపాయ‌లు లంచం ఇచ్చిన‌ట్టు గాలి జనార్ధ‌న్‌రెడ్డి పై కేసు న‌మోదైంది. తాజాగా బ‌ళ్లారిలోని గాలి నివాసంలో సోదాలు జ‌రుగుతున్నాయి. Gali janardhan reddy under lens in rs 600 cr investment fraud

ఇప్ప‌టికే అనేక కేసుల్లో పీక‌ల్లోతు కూరుకుపోయిన గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి తాజాగా మ‌రో కేసులో ఇరుక్కున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసు నుంచి త‌ప్పించేందుకు హంబిడెడ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నార‌న్న అభియోగంపై కేసు న‌మోదైంది. హంబిడెడ్ అనే కంపెనీకి కేసు నుంచి త‌ప్పించేందుకు రూ.21 కోట్ల ఒప్పందం కేసులో బెంగ‌ళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. Gali janardhan reddy under lens in rs 600 cr investment fraud

ఇప్ప‌టికే హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, బళ్లారి స‌హా అన్ని ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. మ‌రో ప‌క్క గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి స్వ‌గృహంలో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. కేసు విచార‌ణ‌ను నీరుగార్చేందుకు రూ.18 కోట్ల‌ను అంబిడెడ్ కంపెనీ నుంచి అంబికా అనే జ్యూవెల‌రీ కంపెనీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. అంబికా కంపెనీ నుంచి బ‌ళ్లారిలోని రాజ్‌మ‌హ‌ల్ జ్యువెల్ల‌రీ కంపెనీకి ఈ న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్టు పోలీసులు ధృవీకీరించారు. రాజ్‌క‌హాల్ కంపెనీ నుంచి జ‌నార్ధ‌న్‌రెడ్డి పీఏ అలీఖాన్ అకౌంట్‌కు రూ.18 కోట్లు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్టు పోలీసులు ధృవీక‌రించారు. అలాగే, అలీఖాన్ నుంచి ఎనోబుల్ ఇండియాకు, ఎనోబుల్ ఇండియా నుంచి గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డికి 52 కిలోల బంగారు అందిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ 52 కిలోల బంగారం ఎక్క‌డుందో చెప్పాలంటూ బెంగ‌ళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. Gali janardhan reddy under lens in rs 600 cr investment fraud

అయితే, కేసు విచార‌ణ‌లో భాగంగా పోలీసులు త‌న‌ను అరెస్టు చేస్తార‌ని ముందుగానే ప‌సిగ‌ట్టిన గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి, అరెస్టు నుంచి త‌ప్పించుకునేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ని ఓ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది. అంతేకాకుండా, ఏపీకి చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ వేత్త‌, హైద‌రాబాద్‌లో గ‌ల‌ విశాల భ‌వ‌న స్వ‌గృహంలో గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డికి ఆశ్ర‌యం క‌ల్పించిన‌ట్టు స‌మాచారం.Gali janardhan reddy under lens in rs 600 cr investment fraud