//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గాలి జనార్దన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు 

Category : national

ఓఎంసీ కేసులో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తన కుమార్తె బ్రహ్మణి వివాహ వార్షికోత్సవానికి గాను లండన్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ పెట్టుకున్న షిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 5 నుంచి 20 వరకు లండన్‌ వెళ్లేందుకు తనను అనుమతించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. సీబీఐ జప్తు చేసిన పాస్‌పోర్టును ఇప్పించాలని కోరారు.

అయితే గాలి జనార్దన్‌రెడ్డి లండన్‌ వెళితే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉందని నిన్న హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఆయన తిరిగి రాకపోతే కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. బ్యాంకులను మోసగించి లండన్‌ వెళ్లిన విజయమాల్యా తిరిగి రాలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు లండన్‌ వెళ్లేందుకు గాలి జనార్దన్‌రెడ్డికి అనుమతి నిరాకరించింది.