ఐపీయల్ లో భాగం గా నిన్న జరిగిన పంజాబ్, నైట్ రైడర్స్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు విజయాన్నిఅందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ ఓపెనర్ క్రిస్ లిన్ (74, 41 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరవిహారంతో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (43) కూడా రాణించాడు.
బ్రేక్ తరువాత భారీ ఛేదన తో బరి లోకి దిగిన పంజాబ్ జట్టు తోలి ఓవర్ నుండే తన ప్రభావాన్ని చూపించటం స్టార్ట్ చేసింది. పంజాబ్ ఓపెనర్స్ గేల్, కెఎల్ రాహుల్‌లు కోల్‌కత బౌలర్ల ను ఉతికారేసారు. తరువాత వర్షం అంతరాయంతో లక్ష్యాన్ని డిఎల్ పద్దతిలో 13 ఓవర్లలో 125 పరుగులకు కుదించారు.
మరో 11 బంతులుండగానే పంజాబ్ పని పూర్తయింది. గేల్ (62), రాహుల్ (60) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెఎల్ రాహుల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు.