Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయాలలోకి రావడంపై క్లారటీ ఇచ్చిన గద్దర్..

Category : politics

ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్ లో చేరుతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ విషయంపై ఈ రోజు గద్దర్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని, ఏ పార్టీలో సభ్యుడిని కాదని స్పష్టం చేసాడు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో గద్దర్‌, ఆయన కుమారుడు సూర్యకిరణ్‌ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో గద్దర్ మాట్లాడుతూ తనపై గతంలో జరిగిన దాడిపై విచారణ జరిపిస్తామని రాహుల్‌ అన్నాడని చెప్పారు.

ఒకవేళ రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే కనుక గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని అయన అన్నారు. త్వరలో అన్ని రాజకీయపార్టీలను కలుస్తానని అన్నారు. ఇప్పటికి కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా ఆచరణకు నోచుకోలేదని గద్దర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం బందీఖానాగా మార్చిందని గద్దర్ విమర్శించారు. ఈ రోజు సాయంత్రం గద్దర్ మరియు అతని ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నట్టు సమాచారం.

Related News