//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాల్ ట్యాంపరింగ్‌కు పూర్తిగా నాదే బాధ్యత...!

Category : sports

బాల్ ట్యాంపరింగ్ చేసినందుకుగాను గాను ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఈ రోజు సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశం పాల్గొన్నాడు. ఈ మీడియా సమావేశం లో స్మిత్ కంటతడి పెట్టాడు.

కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు పూర్తి తనదే బాధ్యత అని, తనను క్షమించాలని అతను కోరాడు. నాయకుడిగా తాను పూర్తిగా విఫలమయ్యానని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందంటూ అతను తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ సందర్భంగా అతను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు. నాకు జరిగిన ఈ నష్టం వల్ల ఏదైనా లాభం ఉందంటే అది ఇతరులకు ఈ ఉదంతం గుణపాఠం కావడమే. ఈ పరిణామం క్రీడా వ్యవస్థలో ఓ మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెటే నా జీవితం, మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కోరుకుంటున్నా" అంటూ స్మిత్ కన్నీటిపర్యంతమయ్యాడు.