//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మటన్‌ లో...మస్తూ.. ఆరోగ్యం....

Category : health

మటన్‌ అంటే నాన్‌వెజ్‌ ప్రియులకు ఎంతో ఇష్టం. అయితే ఏదైనా పరిమితంగా తింటే వాటి ఆరోగ్య సుగుణాలు శరీరానికి వంటబడతాయి. మరి మటన్‌లోని సుగుణాలు, పోషకాలు ఏమిటో తెలుసుకుందామా...

మటన్‌లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది.

శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు మటన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహారం.

ఇందులో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. విటమిన్‌-ఇ, కె, సహజ ఫ్యాట్స్‌, కొలెస్ట్రాల్‌, అమినోయాసిడ్స్‌, ఖనిజాలు (మాంగనీసు, కాల్షియం, జింక్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, సెలేనియం), ఎలకో్ట్రలైట్స్‌ (పొటాషియం, సోడియం), ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఒమేగా6 ఫ్యాటీయాసిడ్స్‌ ఉంటాయి.

ఇందులో ప్రొటీన్లు, న్యూట్రియంట్లు, బి12 బాగా ఉండడం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది.

మటన్‌లో బి12 ప్రమాణాలు అధికంగా ఉండడం వల్ల ఎర్రరక్తకణాలు ఏర్పడతాయి. అంతేకాదు దెబ్బతిన్న కణాలు సైతం బాగుపడతాయి.

గర్భిణీలు తమ డైట్‌లో మటన్‌ని కూడా తింటే పుట్టే బిడ్డలకు న్యూరల్‌ ట్యూబ్‌ లాంటి సమస్యలు రావు.

మటన్‌లో బీకాంప్లెక్స్‌, సెలినియం, కొలైన్‌ వంటివి బాగా ఉండడం వల్ల క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చు.

బహిష్ఠ్ఠు సమయాల్లో తలెత్తే నొప్పి నుంచి మటన్‌ సాంత్వననిస్తుంది. అలాగే బహిష్ఠు సమయాల్లో మహిళలకు అవసరమైన ఐరన్‌ని పుష్కలంగా అందిస్తుంది.

మటన్‌ తినడం వల్ల సొరియాసిస్‌, ఎగ్జిమా, యాక్నే వంటి చర్మ సమస్యలను అధిగమించొచ్చు. అంతేకాదు చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది కూడా.

నిత్యం మటన్‌ని సరైన మోతాదులో తింటే టైప్‌-2 డయాబెటిస్‌, ఇన్ఫెక్షన్లు, ఇతర జబ్బుల రిస్కులో పడకుండా ఉండొచ్చు.

మటన్‌లో అధిక పొటాషియం, తక్కువ సోడియంలు ఉండడం వల్ల రక్తపోటు, స్ట్రోకు, మూత్రపిండాల జబ్బుల రిస్కులు తొందరగా తలెత్తవు.

మటన్‌లో కాల్షియం బాగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందజేస్తూ వాటిని దృఢంగా చేస్తుంది.