//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైతు కుటుంబం నుండి జాతీయస్థాయికి ....

Category : national

అతి సాధారణ వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జూలై 1న  నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో జన్మించిన వెంకయ్యనాయుడు దృఢమైన దీక్షతో, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొంటూ జాతీయస్థాయి నేతగా ఎదిగారు. నెల్లూరు వి.ఆర్ కళాశాల నుంచి  బిఏ పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 

విద్యార్థి దశలోనే న్యాయకత్వ లక్షణాలను అలవరుచుకున్నారు. 1972 జైఆంధ్రా ఉద్యమంలో రాష్ట్రం నలుమూలల విస్తృతంగా పర్యటించి, అనర్గళమైన ప్రసంగాలతో యువతను ఉత్తేజ పరిచారు.  అప్పుడే ఎబివిపి రాష్ట్ర కార్యదర్శిగా అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో పలు నెలలు జైలులో ఉన్నారు.   1973-74లో ఆంధ్ర  యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

1977లో ఒంగోలు నుండి లోక్ సభ కు పోటీ చేయడం ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు.  1977-80 మధ్య కాలంలో జనతా పార్టీ యువజన విభాగం యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గంనుంచి జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది అసెంబ్లీ లో ప్రవేశించారు. 1983లో అదే నియోజక వర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. 

1980-83 మధ్యకాలంలో బీజేపీ యువజన విభాగం యువమోర్చ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1980-83 బీజేపీ శాసనసభపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించారు. 1985లో బీజేపీ  ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1988నుంచి 1993వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. లోక్ సభ ఎన్నికలలో 1991లో ఒంగోలు నుండి, 1989లో బాపట్ల నుండి, 1996లో హైదరాబాద్ నుండి పోటీ చేసి ఓటమి చెందారు. 1985లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి అసెంబ్లీ కి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే, 1998 నుండి వరుసగా మూడు సార్లు కర్ణాటక నుండి  ఎన్నికయ్యారు. 2016లో రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

1993నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2000లో వాజపేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేరారు. 2002 జూలై 1నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004 ఆయన నాయకత్వంలో బీజేపీ ఓడిపోవడంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

1998నుంచి 2000వరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిచడంతో పాటు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. అదే సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. 2014నుంచి నరేంద్ర మోదీ మంత్రిమండలిలో పట్టణాభివృద్ధి, గృహానిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. 1971 ఏప్రిల్ 14 నాడు ఉషను వివాహం చేసుకున్న వెంకయ్యనాయుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు హర్షవర్ధన్ వ్యాపార రంగంలో స్థిరపడగా, కుమార్తె దీపావెంకట్ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు.