అదిరిపోయే ఫీచర్లతో ఉన్న 4జీ ఫీచర్ ఫోన్‌ను భారతీయులు అందరికి ఉచితంగా ఇవ్వనున్నట్లు రిలయెన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు. ఆగస్ట్ 15న ఈ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తేనున్నారు. ఆగస్ట్ 24 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని తెలిపారు. అయితే దీన్ని మిస్ యూజ్ చేయొద్దన్న కారణంగా రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్నట్లు అంబానీ చెప్పారు. దీనిని మూడేళ్ల తర్వాత తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఈ జియో ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.ఈ ఫోన్ మొత్తం వాయిస్ కమాండ్స్‌తోనే పని చేస్తుంది. ఫోన్ చేయాలన్నా, మెసేజ్ పంపాలన్నా, జియో యాప్స్‌ను యూజ్ చేయాలన్నా అన్నీ వాయిస్ కమాండ్స్‌తోనే ఈ ఫోన్ పని చేస్తుంది. దేశంలోని అన్ని భాషలను ఈ ఫోన్ అర్థం చేసుకుందిటుంది. ఈ డెమోను అంబానీ కూతురు ఇషా, ఆకాశ్ అందించారు.
నెలకు రూ.153కే ఈ జియో ఫోన్లో అన్లిమిటెడ్ డేటా అందించనున్నారు. ఇక అన్ని వాయిస్ కాల్స్ ఫ్రీ. జియో ఫోన్ టీవీ కేబుల్‌ను కూడా ఈ సందర్భంగా అంబానీ ప్రకటించారు. ఈ కేబుల్‌తో జియో ఫోన్‌ను ఏ టీవీకైనా కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీలే కాదు.. సాధారణ పాత టీవీలకు కూడా ఈ కేబుల్‌ను కనెక్ట్ చేయొచ్చని అంబానీ తెలిపారు.
దీనిద్వారా జియో ఫోన్ స్క్రీన్‌పై వచ్చే వీడియోలను పెద్ద స్క్రీన్‌పై చూసుకోవచ్చు. దీనికి జియో ధనాధన్ 309 ఆఫర్ వర్తింపజేశారు. దీనిద్వారా రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు నచ్చిన వీడియోలను లార్జ్ స్క్రీన్లపై చూసుకోవచ్చని అంబానీ అన్నారు. వారం, రెండు రోజుల ప్యాకేజీలను కూడా ఆయన ప్రకటించారు. వారానికి రూ.54, రెండు రోజులకు రూ.24 వసూలు చేయనున్నారు. దీనికి జియో ఆకాశ్ ఫోన్‌గా పేరు పెట్టారు.
ఇక ఈ ఫోన్లో మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఒత్తిడిలో కుంగిపోయి.. ఆత్మహత్య ఆలోచనలు వచ్చే వారు ఫోన్లోని 5 నంబర్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే.. ముందుగానే అందులో సెలక్ట్ చేసి ఉంచిన మన దగ్గరి వాళ్లకు మెసేజ్ వెళ్తుంది. మన లొకేషన్ వివరాలు కూడా వాళ్లకు అందడం ఈ ఫీచర్లో ఉన్న స్పెషాలిటీ. వందల ఫీచర్లు ఇప్పటికే ఈ ఫోన్ కోసం అభివృద్ధి చేశామని, మరిన్ని ఫీచర్లు తయారీ దశలో ఉన్నాయని అంబానీ చెప్పారు. అక్టోబర్ నుంచి ఎన్ఎఫ్సీ ఫీచర్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. అన్ని బ్యాంక్ అకౌంట్లను దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు.