//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబుపై క‌క్ష సాధింపు

Category : state politics national

త‌మను ఎదిరించిన సీఎం చంద్ర‌బాబుపై బీజేపీ పెద్ద‌లు భారీ వ్యూహాన్నే సిద్ధం చేశార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ గ‌రుడ - 2 ప్రారంభ‌మైంద‌ట‌. ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో కీల‌క ఫేజే ఆప‌రేష‌న్ గ‌రుడ -2, మే 15 త‌రువాత చుక్క‌లు చూపించ‌బోతున్నార‌నే మాట ఎప్ప‌ట్నుంచో విన‌బ‌డుతోంది.

చంద్ర‌బాబు మీద ఏదో ఒక నెపం పెట్టి కేసులు పెట్టిస్తే.. చంద్ర‌బాబు మీద బుర‌ద‌జ‌ల్లొచ్చ‌ని బీజేపీ కేంద్ర పెద్ద‌లు భావిస్తున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబుపై ముప్పేట దాడి చేస్తున్న చంద్ర‌బాబు ద్వ‌యం.. కేసులు పెట్టి అరెస్టు చేయించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంద‌ట‌. ఏపీలోని వివిధ కాంట్రాక్ట‌ర్ల‌ను ఢిల్లీ పిలిపించుకుని వారితో చ‌ర్చ‌లు కూడా కొన‌సాగిస్తుంద‌ట‌.

అయితే, చంద్ర‌బాబును అరెస్టు చేయించేందుకు బీజేపీ అధిష్టానానికి కారణాలు ఏవీ దొర‌క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త నాలుగేళ్లుగా ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేగా సీఎం చంద్ర‌బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో ఏవైనా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయా.? అలాంటివేవీ క‌న‌ప‌డ‌వు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చి.. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత.. రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మానం కోసం భారీగా నిధులు కేటాయించింది.

ప‌లు ప్రాజెక్టుల‌ను ఆగ‌మేఘాల మీద పూర్తి చేసి.. రైతుల‌కు వాటి ఫ‌లితాల‌ను కూడా అందించింది. ఇప్పుడు అవే ప్రాజెక్టుల‌ను అడ్డుపెట్టుకుని.. దొంగ లెక్క‌లు చూపి.. లెక్క‌ల‌ను తారు మారు చేసి.. చంద్ర‌బాబుపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా కేసులు పెట్టేందుకు బీజేపీ పెద్ద‌లు సిద్ధ‌మ‌య్యారంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది.