//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాలుగు ప్రధాన హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు- ఇదో రికార్డు

Category : editorial national

నాలుగు ప్రధాన హైకోర్టులైన ముంబయి, ఢిల్లీ, కోల్ కతా, చెన్నైల ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు నియమితులయ్యారు. ఇదొక చారిత్రాత్మకమైన రికార్డు. జస్టిస్ 'ఇందిరా బెనర్జీని' మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మర్చి 31 న నియమించటంతో ఈ రికార్డు సాధ్యమైంది. బొంబాయి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ 'మంజులా చెల్లూర్' గత ఆగస్టు 22 న ఆమె బొంబాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 13,2014 నుంచి జస్టిస్ 'రోహాని' పదవిని నిర్వహిస్తున్నారు. కలకత్తా హైకోర్టు యార్డింగ్ ప్రధాన న్యాయమూర్తిగా గత సంవత్సరం డిసెంబర్ 1 నుంచి జస్టిస్ 'నిషిత నిర్మమ్హత్రే' పని చేస్తున్నారు. ఇంతేకాకుండా హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య కూడా నానాటికి పెరుగుతూనే వుంది. వీరి ఆధ్వర్యంలోనైనా మహిళలకు సత్వరన్యాయం జరుగుతుందేమోనని ఆశిద్దాం.