//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాప్‌ 10 కంపెనీల్లో నాలుగు సంస్థలకు రూ.61,931 కోట్లు నష్టం

Category : business

గతవారం స్టాక్‌మార్కెట్‌లో జరిగిన ఒడిదొడుకులలో టాప్‌ 10 కంపెనీల్లో నాలుగు సంస్థలు రూ.61,931 కోట్లు నష్టపోయాయి. సిగరెట్‌ సెస్సును జీఎస్టీ మండలి పెంచిన మరుసటి రోజే ఐటీసీ షేరు భారీగా పతనమైంది. మొత్తం గతవారం జరిగిన ట్రేడింగ్‌లోఒక్క ఐటీసీ నష్టమే రూ.58,902.54 కోట్లు కావడం గమనార్హం.

ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), మారుతీ సుజుకీ ఇండియాలు మార్కెట్‌ విలువ(ఎం-క్యాప్‌) భారీగా నష్టపోతే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీఎసీలు మొత్తం రూ.54,899.59కోట్లు ఆర్జించాయి.

 టాప్‌ 10 కంపెనీల్లో ఒకటైన ఐటీసీ తన మార్కెట్‌ విలువను రూ.58,902.54 కోట్లు నష్టపోయి రూ.3,50,868.47 కోట్లకు పరిమితమైంది. ఎస్‌బీఐ రూ.1,079.01 కోట్లు నష్టపోవడం ద్వారా రూ.2,50,631.58 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.1,067.24 కోట్లు కోల్పోవడంతో రూ.2,61,489.41 కోట్లకు తగ్గిపోయింది. మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్‌ విలువ రూ.882.07 కోట్లు కోల్పోయి రూ.2,27,397.79 కోట్లకు చేరింది.

ఇదే సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీసీ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) మార్కెట్‌ విలువ రూ.17,933.32 కోట్లు పెరిగి రూ.5,15,790.39 కోట్లకు చేరింది. టీసీఎస్‌ రూ.17,630.59కోట్లు ఆర్జించడం ద్వారా రూ.4,76,829.90 కోట్లకు, ఓఎన్‌జీసీ రూ.7,699.94 కోట్లతో రూ.2,11,170.88 కోట్లకు పెరిగింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.5,752.62 కోట్లతో రూ.4,38,422.41 కోట్లకు, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ సంపద రూ.4,080.02 కోట్లు పెరిగి రూ.2,50,764.04 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ రూ.1,803.1 కోట్లు పెరిగి రూ.2,25,077.61 కోట్లకు చేరింది.