Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Category : state politics

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మాణిక్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు.

ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, మాణిక్ రెడ్డి స్వగ్రామమైన మెదక్ జిల్లాలోని ఆందోల్ మండలం డాకూర్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మాణిక్ రెడ్డి మృతితో మెదక్ జిల్లా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. అయన మృతి రాష్టానికి తీరనిలోటని కెసిఆర్ చెప్పాడు . వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు .